15 రోజుల పాటు సంపూర్ణ లాక్‎డౌన్..!

by Shyam |
15 రోజుల పాటు సంపూర్ణ లాక్‎డౌన్..!
X

దిశ ,ఆలేరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలో 15 రోజుల పాటు సంపూర్ణ లాక్‎డౌన్ విధించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ జంపాల రజితకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్, ప్రధాన కార్యదర్శి బెలిదే అశోక్, ఉపాధ్యక్షులు రాయగిరి రాజు, గౌలికార్ జవహర్ లాల్ పాల్గొన్నారు.

కొండపై ఆలయంలో కూడా భక్తులను అనుమతించకుండా కేవలం పూజారులు మాత్రమే దీప నైవేద్యాలు నిర్వహించాలని పేర్కొన్నారు. బయటికి వచ్చిన సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పట్టణంలోని వీధుల్లో బ్లీచింగ్ చల్లడం.. శానిటేషన్‎పై దృష్టి పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు.

Advertisement

Next Story