- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫాంహౌస్‌లో దాడి.. సర్పంచ్‌పై సీపీకి ఫిర్యాదు
దిశ, చేవెళ్ల: భూవివాదంపై ఇద్దరం మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకుందాం రండి అని పిలిచి తన అనుచరులతో కలిసి దాడి చేశాడని ఓ వ్యక్తి గోపులారం సర్పంచ్ శ్రీనివాస్‌పై పోలీలసుకు ఫిర్యాదు చేశాడు. శంకర్ పల్లి మండలం దొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన బర్మల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు, గోపులారం సర్పంచ్ పొడువు శ్రీనివాస్ మధ్య గత కొంతకాలంగా భూవివాదం ఉందని పేర్కొన్నాడు. ఈ నెల 23న సాయంత్రం సర్పంచ్ శ్రీనివాస్ తనకు ఫోన్ చేసి భూవివాదం మాట్లాడుకుందాం.. తన ఫాంహౌస్ కు రావాలని కోరాడని తెలిపాడు. ఆయన సూచన మేరకు ఫాంహౌస్ కు వెళ్లిన తనపై ఆయన అనుచరులు పొడవు రమేష్, శివ, తొండ మల్లేష్ తో కలిసి గోపులారం సర్పంచ్ శ్రీనివాస్ కట్టెలతో దాడి చేశారని ఆరోపించారు.
వారి నుంచి తాను తప్పించుకొని బయటకు వచ్చానని, అదేరోజు రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఆ నలుగురు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశానని తెలిపారు. మూడు రోజులు గడుస్తున్నా శంకర్పల్లి పోలీసులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు బాధితులు శ్రీనివాస్ చెప్పాడు. గతంలోనూ తనపై మూడుసార్లు దాడికి యత్నించారని, తనకు సర్పంచ్‌తో ప్రాణభయం ఉందని బాధితుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు.