ఏపీలో కరోనా నియంత్రణకు కమిటీలు

by  |
ఏపీలో కరోనా నియంత్రణకు కమిటీలు
X

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫారసుల ప్రకారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న పిలుపు మేరకు ప్రభుత్వం ఆరు కమిటీలను నియమించింది. ఈ నేపథ్యంలోనే అర్బన్, రూరల్, ఇండస్ట్రియల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, అగ్రికల్చర్, వాణిజ్య విభాగాల్లో ఆయా విభాగాల ప్రిన్పిపల్ లేదా స్పెషల్ సెక్రటరీల ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు గల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆయా శాఖల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలు ఈ నెల 17వ తేదీ లోపు ఖరారు చేయనున్నాయి. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీలం సహానీ ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed