- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ కుంభకోణం.. టీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లాగా మేశారు: మధుయాష్కీ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ధాన్యం కొనుగోళ్లలో సుమారు రూ. 18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ కమిటీ చైర్మన్మధుయాష్కీగౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్ధతు ధర అందనియకుండా మిల్లర్లు ప్రభుత్వంతో కుమ్మక్కై నట్లు పేర్కొన్నారు. అకాల వర్షాల పేరిట అగ్గువకే కొనుగోళ్లు చేశారన్నారు. రైతులకు కేవలం రూ.1300, రూ.1400 లు ఇచ్చి మిల్లర్లు మోసం చేశారన్నారు. అంటే రూ.1940 ఉన్న కనీస మద్దతు ధర కూడా అందలేదన్నారు.
రైతుల నుంచి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు టీఆర్ఎస్ చెబుతున్నా, దానిలో నిజం లేదన్నారు. నేరుగా ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1940 ఇచ్చిందన్నారు. రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి మూడు, నాలుగు వందల రూపాయాల తక్కువ ధరకు తీసుకోవడం దారుణమన్నారు.
ఈ వ్యవహరంలో టీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లాగా మేశారన్నారు. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రూ.18 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. లేకపోతే ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ పార్టీ నాయకులపై యుద్ధం చేసేందుక కాంగ్రెస్ పార్టీ కార్యచరణ రూపొందించాల్సి వస్తుందని నొక్కి చెప్పారు.