రేషన్ డీలర్లకు కమిషన్ చెల్లింపులు

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లకు కిలో బియ్యానికి 70 పైసలుగా కమిషన్‌ను చెల్లిస్తున్నామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జూన్, జులైలో సరఫరా చేసిన బియ్యానికిగానూ రేషన్ డీలర్లకు రూ. 54.78 కోట్ల కమిషన్‌ను రెండు విడతలుగా చెల్లిస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వెల్లడించారు. మొదటి విడతగా జూన్ నెలలో ఉచితంగా పంపిణీ చేసిన 3.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను రూ. 22.76 కోట్లు, ఆర్.ఓ. రిఫండ్ రూ. 4.32 కోట్లు, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన బకాయిలు రూ. 8.82 కోట్లు, మొత్తం రూ. 35.91 కోట్ల కమిషన్‌ను వెంటనే విడుదల చేయడం జరుగుతుందన్నారు.

Advertisement