- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జడేజాను పొగిడిన మంజ్రేకర్.. నెట్టింట్లో చర్చ!

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజాను గత ఏడాది వరల్డ్ కప్ సమయంలో ‘బిట్స్ అండ్ పీసెస్’ అంటూ వెక్కిరించిన సంజయ్ మంజ్రేకర్ ఏకంగా బీసీసీఐ కామెంటేటర్ ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఐపీఎల్‌కు ముందు తన కామెంట్స్‌కు క్షమాపణలు చెప్పినా అతడిని కామెంటేటర్‌గా తీసుకోలేదు. అయితే తాజాగా టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన మ్యాచ్‌లకు అతడిని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అతడిని కామెంటేటర్‌గా నియమించకుంది. కాన్‌బెర్రాలో జరిగిన మూడో వన్డేలో జడేజా అత్యద్భుతంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యానం భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘జడేజా ఒక మంచి బౌలర్ మాత్రమే కాదు అద్భతమైన బ్యాట్స్‌మెన్. టీమ్ ఇండియాకు అతడొక ఆణిముత్యం’ అంటూ వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు తిట్టిన మంజ్రేకర్ ఇలా పొగడటంతో క్రికెట్ అభిమానులు అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో మంజ్రేకర్ వ్యాఖ్యానం ఒక పెద్ద చర్చలా మారింది.