జగన్‌తో మర్యాదగా అలీ భేటీ

దిశ, వెబ్‌డెస్క్: విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారని.. కానీ, సీఎం జగన్ మాత్రం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి.. ‘ది బెస్ట్ సీఎం’గా నిలిచారంటూ టాలీవుడ్ హాస్యనటుడు అలీ కొనియాడారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను అలీ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ సీఎంగా జగన్ నిలుస్తారని ఆకాంక్షించారు. ‘కొవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎంకు తెలిపానని.. షూటింగ్ ఇతర విషయాలపై చర్చించినట్టు
అలీ చెప్పుకొచ్చారు.

Advertisement