సర్పంచ్ లపై సస్పెన్షన్ వేటు ..ఎందుకంటే

by  |
సర్పంచ్ లపై సస్పెన్షన్ వేటు ..ఎందుకంటే
X

దిశ వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ సర్చంచ్ సున్నం సుశీలపై సస్పెన్షన్ వేటు పడింది. . ఇసుక క్వారీల ద్వారా వచ్చిన డబ్బును తన వ్యక్తిగత ఖాతాలో జమచేసుకుంటోందని ఆమెపై కలెక్టర్ కు సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ అనంతరం ఆరునెలల పాటు ఆమెను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా అదే జిల్లాలో మంగం పేట పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ సుజాత భర్త, ఆమె కుమారుడు కలిసి దాడికి పాల్పడినట్టు కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపి సర్పెంచ్ సుజాతను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఇక మంచిర్యాల దండేపల్లిలో ఉప సర్పంచ్ దమ్మని సత్తయ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు. నిధుల వినియోగానికి సహకరించడం లేదన్న సర్పంచ్ ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ భారతి తెలిపారు.


Next Story