- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అపోహలు వీడి తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలి
దిశ, వనపర్తి: సూపర్ స్ప్రైడర్‌లు అందరూ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష కోరారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, చౌక ధర దుకాణాల డీలర్లు, పెట్రోల్ బంక్ వర్కర్లు, ఎల్పీజీ డీలర్లు, ఫర్టీలైజర్ డీలర్లు, సీడ్ డీలర్లు, తదితరులకు మే 28, 29 తేదీల్లో ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాపరిధిలో 15 ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్ధేశించిన కేంద్రాల్లో మొదటి రోజున గుర్తించిన అర్హులు వ్యాక్సినేషన్ తీసుకోలేదని, అలాంటి వారందరూ శనివారం(29వ తేదీ వరకు) నిర్దేశించిన ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లో తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కేటగిరీలలో జిల్లాకు నిర్ధేశించిన వ్యాక్సిన్ లక్ష్యాన్ని నూటికి నూరుశాతం సాధించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా విజ్ఞప్తి చేశారు.