తనిఖీ చేసిన కలెక్టర్.. ఆ ఉద్దేశమేందో క్లియర్ గా చెప్పారు

by Aamani |
తనిఖీ చేసిన కలెక్టర్.. ఆ ఉద్దేశమేందో క్లియర్ గా చెప్పారు
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలోని ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు వైద్యం అందించే ఉద్దేశంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఆ లక్ష్యంతోనే రోగులకు సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంటా అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్, మునిసిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్ ఉన్నారు.

Advertisement

Next Story