వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి

by  |
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లాలో బ్యాంకుల వారీగా నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను నిర్మల్ జిల్లా సాధించాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 2020-21 వార్షిక సంవత్సరానికి గాను రూ. 9730.57 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు.

వ్యవసాయ రుణాలు రూ.2178.08 కోట్లు కాగా, ఇందులో పంట రుణాలు రూ.1646.45 కోట్లు, చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 195.98కోట్లు, గృహ రుణాలకు రూ.62.40కోట్లు, విద్యా రుణాలకు రూ.36.48 కోట్లను ఆర్థిక సాయం అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పథకంలో అర్హులైన వారందరికీ ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో రుణాలను అందించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అనంతరం 2020-21 వార్షిక రుణప్రణాళిక బుక్ లెట్‌ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.


Next Story