జన సంచార ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం

by  |

దిశ, మహబూబ్ నగర్: జన సంచార ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉమ్మి వేయటాన్ని నిషేధిస్తూ జోగులంబా గద్వాల్ జిల్లా కలెక్టర్ శృతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, ఇతరులకు అంటు వ్యాధులు కలిగించే విధంగా ప్రవర్తించరాదన్నారు. పాన్ మసాలా, గుట్కా, తంబాకు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయటం చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఉత్తర్వులు జిల్లాలో తక్షణం అమలు చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇది ఎంతో అవసరమని కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలోని అన్ని శాఖలు వీటిని అమలులోకి తీసుకురావాలని కలెక్టర్ శృతి ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Tags: collector shruti, statement, Do not spit, public places, mahabubnagar



Next Story