- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్
by Shyam |

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్‌లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ శరత్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో 512 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారని తెలిపారు. నష్టపోయిన రైతుల వివరాలను వీఆర్వోలు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సేకరించాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్‌డిఓ రాజేంద్ర కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Tags: Kamareddy,collector sharath, Inspect crop,Hail rain
Next Story