- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉపాధి హామీ పనుల్లో భౌతిక దూరం తప్పనిసరి: కలెక్టర్ శరత్
దిశ, నిజామాబాద్: ఉపాధి హామీ పనుల్లో కూలీలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, అప్పుడే కరోనా వ్యాప్తిని నియంత్రించగలమని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత హాలులో పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ ఉపాధి హామీ పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూలీలు ఒక్కొక్కరికి మూడు మాస్కులు చొప్పున అందజేయాలని సూచించారు. రూ. 10కి ఒకటి చొప్పున స్వయం సహాయక సంఘాల వద్ద మాస్కులు కొనుగోలు చేయాలన్నారు. కరోనాకు మందు లేనందున మాస్కులు ధరించడం ఒక్కటే మన ముందున్న మార్గమన్నారు. వీటిని ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచేలా కార్యదర్శులు చూడాలని, అందుకు శ్రమశక్తి సంఘాల భాగస్వామ్యంతో గ్రామాల్లో చేపట్టే పనులకు వారిని ఎంపిక చేయాలని సూచించారు. పని కావాలని అడిగిన ప్రతి కూలీకి పనులు కల్పించాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని కలెక్టర్ స్పష్టంచేశారు. కూలీలు చేసిన పనుల వివరాలను రెగ్యూలర్‌గా రికార్డుల్లో నమోదు చేయాలని, కూలీల సంఖ్య పెరగకపోతే జూనియర్ కార్యదర్శులకు మెమోలు జారీ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. శాశ్వత కార్యదర్శులకు ఇంక్రిమెంట్‌లో కోత విధిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, జడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, డీపీవో సాయన్న, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
tags: collector sharath, suggest to labour, physical distance imp, national labour scheme