కౌంటింగ్ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్ కర్ణన్

by Sridhar Babu |
Collector RV Karnan
X

దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్ఆర్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపునకు 8 టేబుళ్లను ఏర్పాటు చేయగా, 24 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. ఒక్కొక్క టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని అన్నారు. లెక్కింపు పకడ్బంధీగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, అర్బన్ తహసీల్దార్ సుధాకర్, కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed