మూసీ ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్

by Shyam |   ( Updated:2020-10-14 07:23:46.0  )
మూసీ ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ :కేతేపల్లి మండల మూసీ ప్రాజెక్ట్‌ వద్ద వరద పరిస్థితిని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో వరద ప్రవాహం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

వరద నీటి ప్రవాహానికి మంగళవారం రాత్రి మూసీ ప్రాజెక్ట్ 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారని తెలిపారు. మిగిలిన ఆరు గేట్లను కూడా ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఎత్తనున్నారని కలెక్టర్ తెలిపారు. మూసీ ప్రాజెక్ట్ ఎగువ మండలం శాలీగౌరారంలోని పలు ముంపు గ్రామాల్లో, దిగువ ప్రాంతాలు కేతేపల్లి , తిప్పర్తి, మాడుగుల పల్లి మండలాల్లోని 17 గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.

ఇంకా రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మూసీ ప్రాజెక్ట్ వరద పరివాహక ప్రాంతానికి వెళ్లొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వర్షం వచ్చే అవకాశం వున్నందున ప్రాజెక్టులో నీటి నిల్వను సాధ్యమైనంత వరకు తగ్గించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed