- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల విభజన ఎఫెక్ట్.. నైట్ షిఫ్ట్‌లో కలెక్టర్ బిజీ
by Shyam |
X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ఉద్యోగుల విభజనలో జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని జిల్లాల్లా కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని మండలాలు విలీనం అయ్యాయి. దాంతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా మహబూబ్‌నగర్‌లోని కొన్ని మండలాలు విలీనం కావడంతో ఉద్యోగుల విభజన అధికారులకు కత్తిమీద సాములాగా మారింది.
అంతేకాకుండా విభజన విషయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా జిల్లాలకు కేటాయింపు జరిగేలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కృషి చేస్తున్నారు. రాత్రి, పగలు లేకుండా మూడు జిల్లాలకు సంబంధించిన 58 శాఖల అధికారులు, కలెక్టర్లు ఉద్యోగుల విభజనలో తలమునకలయ్యారు.
Advertisement
Next Story