నిజామాబాద్ జిల్లాలో 97 మందికి కరోనా నెగెటెవ్

by Shyam |   ( Updated:2020-04-25 07:49:19.0  )

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో అనుమానితుల నుంచి సేకరించిన 97 శాంపిళ్ల రిపోర్టులు నెగెటెవ్ వచ్చాయని కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గత రెండ్రోజులుగా పంపిన శాంపిల్స్‌ అన్నీ నెగెటివ్ వచ్చాయని, ఇందుకు సంబంధించిన రిపోర్టులు గాంధీ ఆసుపత్రి నుంచి అందాయని స్పష్టం చేశారు. మరోవైపు జిల్లాలో 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 30 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ తెలిపారు.

Tags: collector narayana reddy, statement, 97 Corona Negative reports, Nizamabad



Next Story

Most Viewed