సర్పంచ్‌ని సన్మానించిన కలెక్టర్

దిశ, సంగారెడ్డి: గడ్డపోతారం గ్రామంలో పార్క్, వైకుంఠధామం అద్భుతంగా ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆదివారం జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలో పార్క్, వైకుంఠధామం పరిశీలించారు. పనులన్నీ బాగున్నాయని గ్రామ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ ని ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుమతీ, తహసీల్దార్ దశరథ్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement