పదో తరగతి విద్యార్థిని ఇంటికి కలెక్టర్

by Shyam |
పదో తరగతి విద్యార్థిని ఇంటికి కలెక్టర్
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో ప్రతిభ ఉన్న పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫోకస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో శిక్షణ పొందిన ఓ విద్యార్థిని ఇంటికి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు వెళ్లారు. ఆందోళ్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని జ్యోతి ఇంటికి కలెక్టర్ వెళ్లి.. అమ్మాయి చదువు విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను విద్యార్థిని తల్లిదండ్రులను ఆరా తీశారు కలెక్టర్. పరీక్షలు సమీపిస్తున్నందునా చదువుపై శ్రద్ధ పెట్టాలని, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని జ్యోతికి సూచించారు. ఇంట్లో టీవీ పెట్టొద్దని, జ్యోతి చదువుకోవడానికి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సత్యనారాయణ, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed