అభివృద్ధికి అడ్డుపడుతారా: కలెక్టర్

by Shyam |

దిశ, రంగారెడ్డి: అభివృద్ధి చేయాల్సిన ప్రజాప్రతినిధులే అడ్డు పడ్డారు. అధికారం ఇచ్చారు కదా అని అక్రమాలు చేశారు. అడిగే వాళ్లు లేరనుకున్నారేమో మరి.. వారు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈ వ్యవహారం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లే సరికి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడుతున్నారనే వ్యవహారం కలెక్టర్ అమోయ్ కుమార్ దృష్టికి వచ్చింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా కలెక్టర్ ఆయా గ్రామ పంచాయతీల్లో విచారణ జరిపించగా నిధులు గోల్ మాల్, అక్రమాల వ్యవహారం బయటపడింది. మెయినాబాద్‌ మండలంలోని కాశింబౌలి, కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట్, ఫరూక్ మండలంలోని వెల్‌జర్ల గ్రామ సర్పంచ్‌లు అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు బయటపడింది. అంతేకాకుండా, అభివృద్ధి పనుల కోసం చెక్కులు విడుదల చేసేందుకు పలువురు ఉపసర్పంచ్‌లు సంతకాలు చేయనట్లు విచారణలో తేలింది. దీనిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ అమోయ్ కుమార్ వారికి నోటీసులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed