- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టర్ కర్ణన్ కీలక ఆదేశాలు
దిశ, కరీంనగర్ సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16న హుజురాబాద్‌లో పర్యటిస్తున్న సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ డివిజన్‌లోని శాలపల్లి గ్రామంలో నిర్వహించే దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని వివరించారు.
ఆయన పర్యటన సందర్భంగా సభా నిర్వహించే స్థలాన్ని చదును చేసి, డయాస్ నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ ఎస్ఈని ఆదేశించారు. సభా ప్రాంగణంలో వీఐపీ ప్రెస్, జిల్లా అధికారులకు, ప్రజలకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేసి పకడ్బందీగా బ్యారికేటింగ్ చేయాలని అన్నారు. డయాస్ వెనుక భాగంలో వీఐపీలకు రిఫ్రెష్ మెంట్ రూమ్, బయో టాయిలెట్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్‌బీ ఎస్ఈని కర్ణన్ ఆదేశించారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చదును చేయించాలని, ర్యాంపులు నిర్మించాలని పంచాయతీరాజ్ ఈఈ, ప్రజారోగ్య శాఖ ఎస్ఈని, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. మీడియా పాత్రికేయులకు అవసరమైన మీడియా పాసులు జారీ చేయాలని కలెక్టర్ డీపీఆర్ఓను ఆదేశించారు. సభా వేదిక వద్ద బయో టాయిలెట్స్, వీఐపీలకు, ప్రజలకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, తాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈని ఆదేశించారు. సభా వేదిక వద్ద పరిసరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను వెంట వెంటనే బయటకు పంపించాలన్నారు.
ప్రజలకు త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి సభావేదిక వద్ద కాన్వాయ్‌లో అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో మొబైల్ మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, ట్రైనింగ్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.