- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18 ఏళ్లకే సహజీవనం తప్పుకాదు.. అది వారి హక్కు : హైకోర్టు సంచలన తీర్పు
దిశ, వెబ్‌డెస్క్ : యువతీ యువకులకు ఇష్టం ఉంటే సహజీవనం చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇద్దరికి సమ్మతి ఉంటే వివాహ వయసు లేకున్నా సహజీవనం చేయడంలో తప్పు లేదని స్పష్టం చేసింది. హిందు వివాహ చట్టం ప్రకారం అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి కానీ.. 18 నిండితే మేజరేనని, రాజ్యంగం కల్పించిన హక్కులను అతడు పొందవచ్చని పేర్కొంది. 2018లో వయోజనులైన స్త్రీ, పురుషుడు వివాహం లేకుండానే సహజీవనం చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల వయసున్న యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే హిందు వివాహ చట్టం ప్రకారం అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేసునే అర్హత ఉంటుందని, వారి సహజీవనం చెల్లదని కుటుంబ సభ్యులు వారిని విడదీయడానికి ప్రయత్నించారు. దీంతో ప్రేమికులు ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. తమను వేరు చేయాలని చూస్తున్నారని, వారి నుంచి ప్రాణ హాని కూడా ఉన్నదని, రక్షణ కల్పించాలని పిటిషన్ వేశారు.
ప్రేమికులు పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని.. పిటిషనర్ (పురుషుడు) వివాహ వయసుకు చేరుకోలేదన్నది నిజం. కానీ ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి.. యువకుడికి వివాహ వయస్సు రాకపోయినా.. భారతీయ పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పొందకుండా చేయడం సరికాదు’’ అని పేర్కొంది. ఇరువురి అంగీకారంతో సహజీవనం చేయటం అనేది వారి ప్రాథమిక హక్కుఅని స్పష్టం చేస్తు.. పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి, వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తగిన రక్షణ కల్పించాలంటూ గురుదాస్ పూర్ ఎస్ఎస్‌పీని జస్టిస్ హర్నరేష్ సింగ్ ఆదేశించారు.