- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాగ్నిజెంట్ ఇండియా సీఎండీగా రాజేష్ నంబియార్!

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్(Cognizant) ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజేష్ నంబియార్‌ను నియమిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగానూ చేరుస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ఆయన నియామకం నవంబర్ 9 నుంచి అమలవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాజేష్ నంబియార్ నెట్‌వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సియెనా ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు.
భారత్‌లో కాగ్నిజెంట్(Cognizant) సంస్థ కార్యకలాపాలు, ప్రభుత్వం, వినియోగదారులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు రాజేష్ నంబియార్ కృషి చేయనున్నట్టు సంస్థ సీఈవో బ్రయాన్ హాంప్‌షైర్స్ చెప్పారు. వినియోగదారులకు అనుగుణంగా ఐటీ పరిశ్రమలో దిగ్గజ సంస్థగా, ప్రజల జీవితాలను మెరుగు పరిచే విధంగా కాగ్నిజెంట్ సంస్థను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇదివరకు ఉన్న రామ్‌కుమారు రామమూర్తి కొద్ది నెలల క్రితం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రామ్‌కుమార్‌కు కాగ్నిజెంట్ సంస్థతో దాదాపు 23 ఏళ్ల అనుబంధం ఉంది. సంస్థ ఉన్నతి కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఈ ఏడాది జులైలో ఆయన పదవీ విరమణ గురించి ఉద్యోగులకు సీఈవో రాసిన లేఖలో పేర్కొన్నారు.