ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాగ్నిజెంట్!

by Harish |
ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాగ్నిజెంట్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్ కష్టాల్లో ఉన్న ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లోని తమ ఉద్యోగులకు సాయంగా, అసోసియేట్ స్థాయిలో ఉన్న వారికి ఏప్రిల్ నెల జీతానికి అదనంగా 25 శాతం ఇవ్వనుంది. ఈ ప్రకటనతో ఇండియాలోని కాగ్నిజెంట్ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఈ అంశం గురించి నెలకొకసారి సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సంస్థ ఎదుగుదలకు ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత ప్రధానమని భావించి, కస్టమర్లకు నమ్మకమైన సేవలను అందించేందుకు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు సంస్థ స్పష్టం చేసింది. కరోనా మహమ్మరి కారణంగా ఏర్పడ్డ సంక్షోభం నుంచి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఎక్కువమందికి అందించామని, ఇందులో భాగంగానే ఉద్యోగులకు కొత్త ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం, డెస్క్ ఎన్‌క్రిప్టింగ్, అదనంగా బ్యాండ్‌విడ్త్ కనెక్టివ్టీ అందించడం వంటి కీలక చర్యలను కూడా తీసుకుంటున్నట్టు సంస్థ వెల్లడించింది.

అంతర్జాతీయ కంపెనీల మాదిరిగానే తమ సంస్థకు కూడా కరోనా ప్రభావం ఉందని దాన్ని అధిగమించి ముందుకెళ్తామని కంపెనీ తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో మేమందరం కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఒకరికొకరం సాయం చేసుకుంటూ ధైర్యంగా సవాళ్లను అధిగమిద్దాం అని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని సంస్థ కోసం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఉద్యోగుల సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని, కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను భవిష్యత్తుల్లో బహుమతులతో గౌరవిస్తామని సంస్థ వివరించింది.

Tags : Cognizant, Coronavirus, Covid-19

Advertisement

Next Story

Most Viewed