భారీగా కోల్ ప్రొడక్షన్ ఆగిపోయింది

by  |
భారీగా కోల్ ప్రొడక్షన్ ఆగిపోయింది
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సింగరేణి ఓపెన్ కాస్ట్ బావుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. సింగరేణి వ్యాప్తంగా 1.40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కల్గింది. నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి తీవ్రంగా ఆటంకం ఏర్పడింది.

రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించిపోయింది. ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్పత్తి అంతా కూడా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఆయా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఓవర్ బర్డెన్ (ఓబి) మట్టిని తీసే పనులు కూడా నిలిపివేశారు. రామగుండం రీజియన్ లో ocp 1 లో 15 వేల టన్నులు, OCP 2 లో 6 వేల టన్నులు, OCP 3 లో 15 వేల టన్నులు, ocp 4 లో 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఏమాత్రం బొగ్గు తీయలేని పరిస్థితి ఓపెన్ కాస్ట్ లలో నెలకొంది.

వర్షాలతో వరద నీరంతా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లోకి చేరగా భారీ యంత్రాలు నీట మునగకుండా సింగరేణి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదే విధంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు ప్రత్యేకమైన మోటార్లను ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా లిప్ట్ చేస్తున్నారు. బావులన్నీ బురదమయంగా మారిపోయాయి. దీంతో ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. సింగరేణి సంస్థకు చెందిన ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల లో ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు.


Next Story

Most Viewed