- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓపెన్ కాస్ట్‌లోకి భారీ వరద.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి
దిశ, భూపాలపల్లి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వలన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో ఓపెన్ కాస్ట్‌లో పనులు ఆగిపోయాయి. ప్రతిరోజూ సుమారు 4200టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి కాకపోవడంతో సింగరేణికి కోట్లలో నష్టం సంభవించింది. 7,500 మంది కార్మికులకు ఓపెన్ పనికి వెళ్ల లేకపోయారు.
వర్షం ఇలానే ఉంటే మరో రెండు రోజుల పాటు ఓపెన్ కాస్ట్ లో బొగ్గు నిలిచిపోయి భారీ నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గణపురం మండలం వెళ్తుర్ల పల్లి ,అప్పయ్యపల్లి గ్రామాల మధ్య మోరంచ వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రి మొత్తం చుట్టూ నీరు చేరుకోవడంతో ఆస్పత్రిలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. రోగులు సిబ్బంది ఆసుపత్రిలోకి వెళ్లే వీలు లేకుండా ఉంది.