- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటిలింగాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా : స్మితాసబర్వాల్
దిశ, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ గ్రామ శివారులోని పెద్దవాగు వద్ద నిర్మిస్తోన్న కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సీఎంఓ స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల, వెల్గటూర్ గ్రామాలను ఆమె సందర్శించారు. ఈ మేరకు ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు వెల్గటూర్ గ్రామ శివారులో జరుగుతోన్న కాలేశ్వరం లింక్-2 ప్రాజెక్టు పనుల వివరాలు, ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూమి, నీటిని తరలించే సొరంగ మార్గాల సమాచారాన్ని మ్యాప్‌ల ఆధారంగా స్మిత సబర్వాల్‌కు వివరించారు.
అనంతరం స్మితా సబర్వాల్ అధికారులతో కలిసివెళ్లి వెల్గటూర్ గ్రామ శివారులో అండర్ గ్రౌండ్‌లో జరుగుతోన్న టన్నెల్ పనులను పరిశీలించారు. అంతకుముందు మండలంలోని కోటిలింగాల వద్దనున్న గోదావరి(ఎల్లంపల్లి బ్యాక్ వాటర్)లో జిల్లా కలెక్టర్ కలెక్టర్, ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన కోటిలింగాల ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఆలయ పరిరక్షణ కోసం కరకట్ట నిర్మాణం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గుగులోత్ రవి, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వ ర్లు, ఆర్డీఓ మాధురి, వెల్గటూర్, రాజక్కపల్లి సర్పంచ్‌లు మెరుగు మురళి, బొడకుంటి రమేష్ తహసీల్దార్ రాజేందర్, ధర్మపురి సీఐ కోటేశ్వర్, ఎస్ఐ నరేష్‌లు ఉన్నారు.