శ్రీశైలం విద్యుత్ కేంద్ర సిబ్బంది పని తీరు భేష్

by  |
శ్రీశైలం విద్యుత్ కేంద్ర సిబ్బంది పని తీరు భేష్
X

దిశ, న్యూస్‌బ్యూరో: జల విద్యుత్ ఉత్పత్తిలో గత సంవత్సరం అగ్రగామిగా నిలిచిన శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పని తీరును తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు అభినందించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని శనివారం సందర్శించిన ఆయన అధికారులతో సమీక్షించారు. పవర్ గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంవత్సరం కూడా 4500 మిలియన్ యూనిట్ల కన్నా అధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని అధికారులను కోరారు. ఇందుకుగాను వారికి ఆయన పలు సూచనలు చేశారు.

భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రధానమైన మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మాస్టర్ కంట్రోల్ రూములను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అణువణువు పరిశీలించి జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు తిరుగుతూ కీలక మరమ్మతులు చేయాల్సిన ప్రదేశాలను గుర్తించారు. విద్యుత్ ఉత్పత్తి చేయడంలో నిమగ్నమైన కార్మికులు సిబ్బందితో పాటు వారి కుటుంబాలను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైనే ఉందని పేర్కొన్నారు.



Next Story