డ్రగ్ కంట్రోల్‌పై సీఎం జగన్ సమీక్ష

by srinivas |
డ్రగ్ కంట్రోల్‌పై సీఎం జగన్ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ మందుల కట్టడి కోసం డ్రగ్ కంట్రోల్ విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అమరావతిలో డ్రగ్ కంట్రోల్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బ్లోవర్ విధానం అమల్లోకి తీసుకురానుంది. నకిలీ మందుల తయారీ, విక్రయం, నాణ్యతలేమిపై సమాచారమిస్తే రివార్డులు కూడా ఇస్తామని జగన్ ప్రకటించారు. ఇందుకోసం నకిలీ ఔషధాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. అలాగే, ల్యాబ్‌లలో సామర్థ్యం పెంపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సందర్భంగా డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రగ్ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానా విధించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలు పెట్టాలన్నారు. థర్డ్ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మందుల దుకాణాల వద్దనే ఫిర్యాదు నంబర్ సమాచారం ఉంచాలన్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఆస్ప్రత్రుల మందులపై క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కేవలం నెల రోజుల్లోనే కార్యాచరణ కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed