డాక్టర్​ గురుమూర్తిని గెలిపించండి.. లబ్ధిదారులకు వైఎస్ ​జగన్ ​లేఖలు

by Anukaran |
Ys Jagan
X

దిశ, ఏపీ బ్యూరో : తిరుపతి ఉప ఎన్నికల్లో సీఎం జగన్ వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారందరికి ఆయన లేఖలు రాశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టరు గురుమూర్తిని గెలిపించాలని సీఎం వైఎస్​జగన్​విజ్ఞప్తి చేశారు. గత 22 నెలల కాలంలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్న నియోజకవర్గంలోని లబ్ధిదారులకు గురువారం జగన్​స్వయంగా లేఖలు రాశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై జగన్​సంతకం చేశారు.

వైఎస్సార్​సున్నా వడ్డీ, చేయూత, ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, పింఛను కాను, అమ్మ ఒడి, పేదలందరకీ ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంలాంటి అన్ని సంక్షేమ పథకాల కింద చేకూర్చిన లబ్ధి గురించి పేర్కొన్నారు. గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్య, వ్యవసాయం, రైతులు, మహిళా స్వాలంబన, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనుల గురించి జగన్‌ లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 90 శాతానికి పైగా అమలు చేసినట్లు వెల్లడించారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి డాక్టర్‌ గురుమూర్తిని అఖండ మెజార్టీతో విజయం చేకూర్చాలని అభ్యర్థించారు. వైఎస్ జగన్ రాసిన లేఖలను పార్టీ కార్యకర్తలు ఆయా కుటుంబాలకు అందించనున్నారు.

Advertisement

Next Story