- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మెడిసిన్ కోసం టిక్ టాక్: సీఎం రియాక్ట్

తల్లి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో చలించిపోయిన కూతురు ఎలాగైనా మందులు తెప్పించుకోవాలని ఆరాటపడింది. బయటకు వెళ్లి మందులు తీసుకువద్దామనుకుంటే లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఇంతలో ఆ యువతికి ఓ ఐడియా వచ్చింది. తన పరిస్థితిపై వీడియో తీసి టిక్‌టాక్‌లో పెట్టింది. అది కాస్తా వైరల్‌గా మారడంతో సీఎం యడ్యూరప్ప స్పందించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా రాయదుర్గ తాలుకా నరసాపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శేఖర్వ అనే మహిళకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇటీవల కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో మెడిసిన్స్ అందుబాటులో లేకుండా పోయాయి. తల్లి బాధను వివరిస్తూ ఆమె కూతురు పవిత్ర వీడియో తీసి టిక్ టాక్‌లో పెట్టింది. ఈ వీడియో చూసిన సీఎం యడ్యూరప్ప అధికారులను పంపించి రెండు నెలలకు సరిపోయే మెడిసిన్‌లను అందించారు.
Tags: cm Yeddyurappa, respond, tiktok video viral, karnataka