శశికళకు సీఎం పళనిస్వామి స్ట్రాంగ్ వార్నింగ్

by Shamantha N |
శశికళకు సీఎం పళనిస్వామి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో అరస్టై ఇటీవల జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి చక్రం తిప్పబోతున్నారని ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జయలలిత మరణాంతరం శశికళ పార్టీ పగ్గాలు చేపడుతారని అంతా భావించినా.. చివరి క్షణంలో అక్రమాస్తుల కేసులో జైలు పాలవ్వడం.. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి.

తాజాగా శశికళ బయటకు రావడంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని AIDMK నేతలతో గుట్టుగా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి శశికళకు బహిరంగంగా వార్నింగ్ గుప్పించారు. అన్నాడీఎంకేను నాశనం చేయడానికి విషశక్తులు కుట్రపన్నుతున్నాయన్నారు. పార్టీ పదవి నుంచి తొలగింపబడిన వాళ్లు ఏడీఎంకేను క్యాప్చర్ చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆటలు సాగనివ్వను అని పళనిస్వామి స్పష్టంచేశారు.

Advertisement

Next Story