కామారెడ్డిలో కేసీఆర్ పర్యటన.. శనివారం రాత్రే వాళ్లు అరెస్ట్

by Shyam |
Student union leaders
X

దిశ, కామారెడ్డి: సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. ఉండేందుకు జిల్లా పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. శనివారం రాత్రి నుంచి వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రకటన, బీబీపేట చెరువు నింపడానికి చేపట్టే చర్యలను సీఎం తన పర్యటనలో ప్రకటించాలని అటు మెడికల్ కళాశాల సాధన సమితి, ఇటు బీబీపేట చెరువు పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ప్రకటన చేయకపోతే సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా వారిని అరెస్టు చేశారు. బీజేపీ నాయకులు, ఏబీవీపీ, టీజేఎస్ విద్యార్థి సంఘాల నాయకులను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.

వీరిని మొదట దేవునిపల్లి పోలీస్ స్టేషన్, తర్వాత కామారెడ్డి, అక్కడినుంచి సదాశివనగర్, అక్కడినుంచి బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం రాకను నిరసిస్తూ నేడు ఉదయం ఆందోళన చేపట్టినబ బీబీపేట యువ రైతులు, మెడికల్ కళాశాల సాధన సమితి సభ్యులు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బీబీపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంకా మిగిలిన నాయకులను ఇళ్ల వద్దకు వెళ్లి మరీ అరెస్టు చేస్తున్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మెడికల కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed