- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వామన్ రావు హత్యపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పెద్దపల్లిలో హత్యకు గురైన అడ్వొకేట్ వామన్ రావు దంపతుల గురించి ప్రస్తావించారు. హత్యలో ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిని పార్టీ నుంచి తొలగించాం.దోషులు ఎవరైనా వారికి కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.
కాగా, ఈ కేసులో పెద్దపల్లి జెడ్పీటీసీ పుట్టమధు హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. అతని మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుంట శ్రీను ఇద్దరినీ పోలీసు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, వామన్ రావు దంపతుల హత్యకు ఆయుధాలు, వాహనం సమకూర్చింది బిట్టు శ్రీను కావడంతో అతని మామ జెడ్పీటీసీ పుట్టమధు ఇన్వాల్వ్ మెంట్ తప్పక ఉంటుందని, దానిపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story