ఇంటర్ ఆల్ పాస్..! ఫస్టియర్ రిజల్ట్స్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

by Shyam |   ( Updated:2021-12-20 07:12:19.0  )
cm kcr
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నడు లేని విధంగా ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు ఇప్పటికే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో విద్యార్థి సంఘాలు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే.

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఫలితాలపై పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో వీలైనంత త్వరగా పాస్ చేసే అంశంపై ప్రకటన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి విద్యార్థికి కనీస పాస్ మార్కులను వేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. కరోనా కారణంగా జరిగిన ఆన్లైన్ తరగతులతో చాలా మంది చదువుకు దూరం అయ్యారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పదోతరగతి పరీక్షలు రాయకుండా ప్రమోట్ అయినవారే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed