- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీ పడేది లేదు.. తెలంగాణ గొంతు గట్టిగా వినిపించాలి: కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, తెలంగాణ వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాలపై వెనకడుగు వేసేదిలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేస్తుందని నొక్కిచెప్పారు. కృష్ణా, గోదావరి నీటి యాజమాన్య బోర్డుల సమావేశాల్లో తెలంగాణ గొంతును గట్టిగా వినిపించాలని సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌పై ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం లోతుగా సమీక్షించిన కేసీఆర్ పై వ్యాఖ్యానాలు చేశారు. గతంలో బచావత్ ట్రిబ్యునల్, ప్రస్తుత బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించిన కేసీఆర్ విస్తృతంగా అధ్యయనం చేయడానికి ఆదివారం కూడా సమావేశాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇటీవల నిర్దేశించి అక్టోబరు 14వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న నేపథ్యంలో కేసీఆర్ సమీక్షించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. త్వరలో జరగనున్న కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటి వాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలమపై కూడా అధికారులతో లోతుగా సమీక్షించారు. గోదావరి, కృష్ణా నదీజలాల్లో ఉభయ రాష్ట్రాలకు ఉన్న నీటి వాటాల గురించి విస్తృతంగా సమావేశం చర్చించింది.
ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఇంజనీర్-న్-చీఫ్‌లు మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వొకేట్ రవీందర్ రావు, ఇరిగేషన్ శాఖ అంతర్ రాష్ట విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, ఎస్ఈ కోటేశ్వర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.