హలో.. నేను సీఎం కేసీఆర్‌ను మాట్లాడుతున్నా !

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేశారు. శనివారం సాయంత్రం కార్యదర్శి రమాదేవికి ఫోన్ చేసిన సీఎం.. గ్రామంలో అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల నిర్వహణతో పాటు, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి విషయాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం అడిగిన వివరాలకు మొత్తం సమాధానం చెప్పినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.

Advertisement