- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వాటాలు తేలిన తర్వాతే బోర్డుల పని.. మంత్రి షేకావత్ ని కోరిన కేసీఆర్

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరపనున్న సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం షెకావత్ ను కలిసి.. కృష్ణా, గోదావరి నది జలాల అంశాలు, నది యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలో ఉంచాలని, వాటాలు తేలిన తర్వాతే బోర్డుల పని చేపట్టాలని కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.
Next Story