- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ అలాంటి సంస్కృతిని నెలకొల్పాలి
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అధికారులు, సిబ్బంది చిత్తుశుద్ధితో కృషిచేసి రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఇకనుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా వినాలని శనివారం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
గతంలో మండలాలు, గ్రామాల్లో బాగా పనిచేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించేవారని, మళ్లీ అలాంటి సంస్కృతిని నెలకొల్పాలని సీఎం సూచించారు. అధికారులు తమతో ఎలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారని, రెవెన్యూ యంత్రాంగం సమస్యలను పరిష్కరించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
Advertisement
Next Story