- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Lock down: లాక్‌డౌన్‌పై మరి కాసేపట్లో కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరికాసేపట్లో కీలక ప్రకటన వెలువడనుంది. ప్రగతిభవన్ వేదికగా రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి లాక్‌డౌన్, సడలింపు అంశాలపై చర్చలు జరుపనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకైతే కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కఠినంగానే అమలవుతోంది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి ఇవ్వడం లేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఆదివారం వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అయితే ఆదివారం తర్వాత ఏమిటీ..?, లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా కేసులు తగ్గాయని సడలింపులు ఇస్తారా? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.