- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ ఈదాలని ఉంది: ఎర్రబెల్లి
దిశ, వరంగల్: అటు వైపు చూస్తుంటే ఆనందంతో కన్నీరొస్తున్నది.. అంతేకాదు చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేయాలనున్నదని రాష్ట్ర మంత్రి చెప్పుకొచ్చారు. దేవాదుల కాలువ పరిశీలన కోసం మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో సాగుబడి పెరిగి సస్యశ్యామలం అవుతోందని, ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైందని, కాలువల్లో నీటిని చూస్తుంటే కళ్లల్లో ఆనందంతో కన్నీరొస్తుందన్నారు. చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ఈ కాలువలో ఈదాలని ఉందన్నారు. ఈ జన్మకి ఇలా కాలువల్లో నీటిని తెలంగాణలో ఈ ప్రాంతంలో చూస్తామను కోలేదన్నారు. నాటి ఉద్యమ నేత, నేటి ప్రభుత్వ సారథి కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. కేసీఆర్ తెలంగాణను తేవడమే కాదు తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తున్నారన్నారు. సీఎంకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు.
దేవాదుల ప్యాకేజీ-46 దక్షిణ ప్రధాన కాలువ రూ. 78.20 కోట్ల వ్యయంతో 16.90 కి.మీ. పొడవుతో నిర్మితమైందన్నారు. ఈ దక్షిణ కాలువ ద్వారా మూడు నియోజకవర్గాల్లోని 8 మండలాలు, 33 గ్రామాల్లోని మొత్తం 91,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతదని మంత్రి చెప్పుకొచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని 11 గ్రామాల్లో 40,178 ఎకరాలు, వర్దన్నపేట నియోజకవర్గంలోని 11 గ్రామాల్లో 36,911 ఎకరాలు, పరకాల నియోజవర్గంలోని 7 గ్రామాల్లో 14,611 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మంత్రి వెంటా ఎంపీ పసునూరి దయాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.