- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR : కేసీఆర్ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నొస్టిక్ సెంటర్లు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నొసిక్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని డయాగ్నొస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని శనివారం సమీక్ష సమావేశంలో వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీకి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయని తెలిపారు.
సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని సీఎం తెలిపారు. అదునూతన టెక్నోలజీతో ఏర్పాటు చేసిన ఈ యంత్రల ద్వారా గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత ఖశ్చితత్వంతో అందచేస్తాయని తనకు వైద్యాధికారలు తెలిపారని సీఎం అన్నారు. ‘‘వైద్య అవసరాల కోసం నాలుగు రకాల ఖర్చులుంటయని దవాఖానకు పోవడానికి రవాణా ఖర్చు, పోయినంక డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షల ఖర్చు, ఇన్ పేషెంట్‌గా షరీఖ కావాలంటే ట్రీట్మెంట్ ఖర్చు, రోగం నయమయినంక తిరిగి ఇంటికి పోవాలంటే మళ్లీ రవాణా ఖర్చు, ఒకవేళ చనిపోతే వారి పార్థివదేహాన్ని తరలించడానిక అదో ఖర్చు ఇన్ని తీర్ల ఖర్చులుంటయి’’ అని సీఎం వివరించారు. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వ దవాఖానాలలో పూర్తి ఉచితంగా సామాన్యులకు వైద్య సేవలందిస్తున్నదని సీఎం తెలిపారు.