ప్రోటోకాల్ పై ప్రజాప్రతినిధుల ఫిర్యాదు.. అధికారులకు కేసీఆర్ వార్నింగ్

by Shyam |   ( Updated:2021-09-24 03:03:10.0  )
ప్రోటోకాల్ పై ప్రజాప్రతినిధుల ఫిర్యాదు.. అధికారులకు కేసీఆర్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన శాసనసభ్యులకు తొలుత సంతాపాలు ప్రకటించారు. అసెంబ్లీలో అజ్మీర్‌ చందూలాల్‌, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్‌ఆర్‌, మాచర్ల జగన్నాథం, మండలిలో రెహమాన్‌, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆ తరువాత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ అధ్యక్షతన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను చర్చించారు. అయితే.. అక్టోబర్ 5వ తేదీ వరకు సభలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించగా.. కాంగ్రెస్ మాత్రం సభలను 20 రోజులు జరపాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సభా పని దినాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో ప్రొటోకాల్ పాటించట్లేదని సీఎం దృష్టికి కొందరు సభ్యులు తీసుకొచ్చారు. తప్పనిసరిగా.. ఉన్నత స్థాయిలో ప్రొటోకాల్ అమలు చేయాల్సిందేనని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా.. ఢిల్లీలో కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఉన్న మాదిరిగానే.. రాష్ట్రంలోని శాసన సభ్యులకు, ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం సమావేశంలో తెలిపారు.

Advertisement

Next Story