ఎల్లుండే కొత్త రెవెన్యూ చట్టం: కేసీఆర్

by  |
ఎల్లుండే కొత్త రెవెన్యూ చట్టం: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ఎల్లుండే నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో చాలా మంచి చట్టం తీసుకొస్తున్నామన్నారు. రెవెన్యూ బిల్లు పాసైన రోజు ప్రతీ గ్రామంలో బాణసంచా కాల్చాలని సీఎం పిలుపునిచ్చారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

విజయం మనదే:
నయాభారత్, గియా భారత్ ఏమీ లేదన్న కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశానికి చేసిన మేలేమి లేదని విమర్శించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ లక్ష మెజారిటీతో గెలుస్తోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మళ్లీ విజయం మనదే అని జోష్యం చెప్పారు. జీహెచ్ఎంసీలో నాలుగు సర్వేలు చేయించామని.. 100 సీట్లు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed