సీఎం జగన్ సరికొత్త పథకాలు ఇవే..!

by Anukaran |
సీఎం జగన్ సరికొత్త పథకాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ఫ్లస్, సంపూర్ణ పోషణా పథకాలను సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ పథకాల కోసం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చుచేయనున్నట్లు చెప్పారు. గర్భిణులు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు ఈ పథకాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తామన్నారు. ఈ బాధ్యతను అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

పౌష్టికాహార లోపంతో పిల్లలు చదువులోనూ, ఆలోచనల్లోనూ బలహీనులుగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెట్టినట్టు వివరించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్‌ బోధన తీసుకొచ్చామని చెప్పారు. త్వరలోనే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మారుస్తామన్నారు. గర్భిణుల్లో 53 శాతం మందికి రక్త హీనత ఉందని, తక్కువ బరువు ఉన్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉన్నారని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed