- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నివారణపై జగన్ సమీక్ష
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా టెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం
కరోనా నివారణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 104,14410 కాల్ సెంటర్లు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 139 కొవిడ్ సెంటర్లలో సదుపాయాలు, పారిశుద్ధ్యం బాగుండాలని సూచించారు.
టెలిమెడిసెన్ ద్వారా మందులు వాడుతున్నవారికి మళ్లీ ఫోన్ చేసి ఆరా తీయాలన్నారు. ఎప్పటికప్పుడూ లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ నెలలో స్కూల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విద్యార్థులందరికీ మాస్కులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలన్న దానిపై ఏఎన్ఎం చెప్పాలని అధికారులకు వివరించారు. అలాగే, కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.