- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2021 నాటికి పోలవరం పూర్తి: సీఎం జగన్
దిశ, ఏపీ బ్యూరో: రైతుల సంతోషమే ముఖ్యమని, వారు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన–మీ సూచన’ పేరిట నిర్వహిస్తున్న మేధోమథన సదస్సులో మంగళవారం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు 3,648 కి.మీ. పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూశానని, అందుకే వారి కష్టాలను తొలగించేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని గుర్తు చేశారు. పంటలు వేయక ముందే గిట్టుబాటు ధరలను ప్రకటిస్తామని తెలిపారు. సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు లాభపడతారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులను ఎలా ఆదుకోవాలో ఆలోచించామని పేర్కొన్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన ద్వారా రూ. 13,500 పంట సహాయం అందిస్తున్నామన్నారు. ఈ సహాయం వచ్చే ఐదేళ్లపాటు అందిస్తామని చెప్పారు.
పంటల బీమాకు రూ.1270 కోట్లు
రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.1270 కోట్లు చెల్లించామన్నారు. పంట నష్టం జరిగితే వెంటనే రైతులకు సహాయం అందాలని చెప్పారు. అంతేకాకుండా రైతుల కోసం వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఉచితంగా బోర్లు కూడా వేయిస్తామని చెప్పారు. ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంపై ఏటా రూ.8,800కోట్ల భారం పడుతున్నా అమలు చేస్తున్నామన్నారు. పగటిపూట కరెంట్ ఇచ్చేందుకు రూ.1700 కోట్లతో ఫీడర్లు ఆధునికీకరించినట్టు వెల్లడించారు. ఈ ఖరీఫ్ నాటికి 82శాతం ఫీడర్లలో 9 గంటల ఉచిత విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. రూ.1100 కోట్లు వెచ్చించి పంటలు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. మొక్కజొన్న, టమాట, అరటి పంటలను ఇంతవరకు ఏ ప్రభుత్వమూ కొనుగోలు చేయలేదని కానీ, తమ ప్రభుత్వం కొనుగోలు చేసి, వారం రోజుల్లోనే నగదు చెల్లించామని చెప్పారు. ఎనిమిది నెలల్లో 5.60లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. పామాయిల్ రైతులను కూడా ఆదుకున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా జలవనరుల శాఖలో రూ.1,095కోట్లు ఆదా చేసినట్టు తెలిపారు.
నష్టం లేకుండా నీళ్లను తరలిస్తాం
2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి కరువును తరిమేందుకోసం చేపడుతున్న ప్రాజెక్టులపై కూడా వివాదాలు సృష్టిస్తున్నా సానుకూలంగా సాగుతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం చంద్రబాబునాయుడుతోనే కాకుండా ఈనాడు, ఏబీఎన్, టీవీ-5 వంటి చెడిపోయిన వ్యవస్థలపై కూడా యుద్ధం చేస్తున్నామని సీఎం అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టుపై వివరణ ఇస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలమన్నారు. అదే 854 అడుగుల్లో ఉంటే కేవలం 7వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోగలమని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి? అని ఆయన ప్రశ్నించారు. 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తోంది. అదే 800 అడుగులపైన రాష్ట్రానికి కేటాయించిన నీళ్లను తీసుకుంటామని, అలా తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు.