కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

by srinivas |
కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అధికారులు చేపట్టిన చర్యలను సీఎం జగన్‌కు వివరించారు. అంతేగాకుండా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, మరింత కట్టడి చేసి వైరస్‌ను అంతం చేయాలని సీఎం జగన్ వారికి సూచించినట్టు సమాచారం. కాగా కరోనా నివారణకు సీఎం జగన్ ఎప్పటికప్పడు సమీక్ష చేపడుతున్నారు.

Next Story

Most Viewed