- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP CM YS Jagan : అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ.. సింగిల్ వాయిస్ వినిపిద్దాం..!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళ వ్యాక్సిన్ కొరత ఆ రాష్ట్రాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. టీకాలు అందుబాటులో లేకపోవడం, కేంద్రాన్ని సాయం కోరితే ఆలస్యం అవుతుండటంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న టీకా కంపెనీల వద్ద పెద్ద ఎత్తున నిల్వలు లేకపోవడంతో కేంద్రం గ్లోబల్ టెంటర్లు నిర్వహించుకోవచ్చునని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దేశంలోని వ్యాక్సిన్ కంపెనీల నుంచి రాష్ట్రాలే టీకాలు కొనుగోలు చేసుకోవాలని, తాము సరఫరా చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు సీఎం జగన్ ఆహ్వానించగా ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. నిన్న కేరళ సీఎం పినరయి విజయన్‌కు రాసిన లేఖ గురించి జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత, కేంద్రం స్పందన గురించి అందులో పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల వ్యవహారం కేంద్రం అనుమతి లేకుండా జరగదని ఓ అభిప్రాయానికి వచ్చిన జగన్.. ఈ విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సింగిల్ వాయిస్ వినిపించాలని లేఖ ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్రం నుంచి సరైన సమయంలో వ్యాక్సిన్లు రాకపోవడం వలన కొవిడ్ మరణాలు పెరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా కేంద్రాన్ని నిలదీయాలని జగన్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.